సాయిబాబా మృతికి మావోయిస్టుల సంతాపం.. 2 m ago

featured-image

శనివారం రాత్రి నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన ప్రజాస్వామిక వాది రచయిత, మేధావి ప్రొఫెసర్ సాయిబాబాకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట సోషల్ మీడియా వేదికగా ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేశారు. ఈ లేఖలో ఈ విధంగా పొందుపరిచారు…. సాయిబాబా ఆశయాలను, ఆదర్శాలను కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు తన వారసులుగా కొనసాగించాలని పేర్కొన్నారు. పౌర హక్కులను పరిరక్షించడానికి ప్రజల తరఫున గొంతెత్తిన సాయిబాబాను బ్రాహ్మణయ్య, హిందుత్వ, ఫాసిస్టు రాజ్యమే హత్య చేసిందన్నారు. ఢిల్లీ ప్రొఫెసర్ గా కొనసాగుతూ తెలంగాణ ఉద్యమానికి మార్గనిర్దేశం చేశారని కొనియాడారు. 1997 డిసెంబర్‌లో ఎఐపిఆర్ఎఫ్ ప్రజాస్వామిక తెలంగాణ కోసం రెండు రోజుల సదస్సు జరిగిందన్నారు. ఈ సభలో వరంగల్ డిక్లరేషన్ జరిగిందని ఆ స‌దస్సుకు జిఎన్ సాయిబాబా నాయకత్వం వహించారని పేర్కొన్నారు. ఆల్ ఇండియా పీపుల్స్ రిజిస్ట్రేషన్ ఫారం ఏఐపిఆర్ఎఫ్ లో కొనసాగుతూ ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణకై పోరాడారు.

ఫోరం ఇన్ పీపుల్స్ వేదికలో క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రజాస్వామ్యవాదుల కార్పొరేట్ల సంస్థల ప్రయోజనాల కోసం దేశ సంపదను ప్రకృతి వనరులను కొల్లగొట్టడానికి దేశ ప్రజలపై, ప్రధానంగా ఆదివాసి ప్రజలపై సల్వాజుడు పేరుతో కొనసాగుతున్న వైశాచిక దాడులను ఖండించారు. దేశంలో పైశాచికంగా కొనసాగుతున్న రాజహింసను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారన్నారు. ప్రజాస్వామికబద్ధంగా ప్రశ్నించడం ప్రశ్నించే శక్తులను తయారు చేయడం నేరుగా భావించిన రాజ్యం కుట్రపూరితంగా మానవ హక్కులను ఉల్లంఘిస్తూ పెగాసిస్ వంటి మాల్వేర్స్, సాఫ్ట్వేర్ల ద్వారా సాయిబాబా కంప్యూటర్ లో చొరబడి మావోయిస్టుల సాహిత్యాన్ని చొప్పించి మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడని నిన్న ఆరోపణలు చేసి రాజ్యాంగ విరుద్ధ చట్టాలను అక్రమంగా మోపారు.

నిర్దోషిని 90శాతం అంగవైకల్యంతో కదలలేని స్థితిలో వీల్ చైర్ లో ఒకరి మద్దతు లేకుండా తన పని తాను చేసుకోలేని స్థితిలో ఉన్న సాయిబాబాను అన్యాయంగా పది సంవత్సరాలు ఒంటరి అండ సెల్‌లో నిర్బంధించారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న జైల్లోనే ఎలాంటి వైద్య సౌకర్యాలు అందకుండా చేశారు. చివరి దశలో నిర్దోషిగా నిరూపించబడి విడుదల చేయాలని మహారాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ ఆ తీర్పును సవాల్ చేస్తూ హిందుత్వ శక్తులు ఎన్ఐఏ తన విడుదలను జైల్లో దుర్భర పరిస్థితులను కల్పించి తన ఆరోగ్యాన్ని దెబ్బతీశారు. మరణానికి బ్రాహ్మణయ్య హిందుత్వ ఫాసిస్ట్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలే పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD